Akbar birbal story in Telugu
#దురదగుంటాకు.....!!
ఒక రోజు అక్బర్, బీర్బల్ ఇద్దరూ వ్యాహ్యాళికి వెళ్లారు.
దారిలో తులసి చెట్టు కనిపించేసరికి బీర్బల్ వంగి సంస్కారంతో ప్రణామం చేసాడు.
ఎవరది ఏంటది అనడిగాడు అక్బర్....!. దానికి బీర్బల్ - "మాతల్లి తులసీమాత రాజా..." అని వినయంగా చెప్పడం జరిగింది.
అక్బర్ వెంటనే అది పీకి పారేసి "ఎంతమంది తల్లులు ఉంటారు మీ హిందువులకు" అంటూ ఎగతాలిగా అన్నాడు.
అది విని ఎలాగైన అక్బర్ కి బుద్ధి చెప్పాలని సరైన అవకాశం కోసం ఎదరుస్తూ చూస్తూ బీర్బల్ ఓపిగ్గా అక్బర్ వెంట నడుస్తున్నాడు.
ఓ చోట #దురదగుంటాకు చెట్టు కనపడింది, వెంటనే ఆ చెట్టుకు బీర్బల్ పితృ దేవేభ్యోన్నమః అంటూ నమస్కారం చేసాడు.
అక్బర్ కి మళ్ళీ కోపం వచ్చి రెండు చేతులతో దాన్ని పీకే ప్రయత్నం మొదలు పెట్టాడు. అంతలోనే అతనికి దురద మొదలవడంతో, అక్బర్ ఏమిటిది అని దురద వల్ల గొకుంటూ బీర్బర్ ని అనడిగాడు.
దానికి బీర్బల్.... అక్బర్ పడుతున్న అవస్థను చూసి తన్ను కొస్తున్న నవ్వును ఆపుకొంటూ... "రాజా మీరు మా తులసి తల్లిని అకారణంగా దండించినందుకు పితృదేవులకు కోపం వచ్చింది" అని చెప్పాడు.
అక్బర్ చేతులు శరీరం లో ఎక్కడ పెట్టినా అక్కడ దురద మొదలైంది.
దాంతో, ఏదైనా ఉపాయం చెప్పు బీర్బల్ త్వరగా అన్నాడు అక్బర్ బాధతో.
దానికి బీర్బల్ "ఉపాయం ఉంది, ఉపశమనం లభిస్తుంది, కానీ అదీ మా ఇంకో తల్లి దగ్గర వేడుకోవాలి మీరు మహరాజా" అన్నాడు అక్బర్ తో.
అది విన్న అక్బర్ "ఏదో ఒకటి తొందరగా చెయ్యి దురద బాధ భరించలేకున్నా" అన్నాడు బీర్బల్ తో.
అలాగే రాజా అంటూ బీర్బల్.... "అదిగో అక్కడ ఉన్న గోమాతని అడగండి, మాతా, తగిన మందుని ప్రసాదించ మని అడగండి" అన్నాడు.
అక్బర్ ఆ విధంగా అడగడంతో ఆవు పేడ వేసింది, ఆ పేడను లేపనంగా పూయాడంతో అక్బర్ కి దురద నుండి ఉపశమనం లభించింది!
కానీ పేడతో నిండిన తన శరీరాన్ని చూసుకుని, బీర్బల్ ని అక్బర్ అడిగాడు "రాజమహల్ కి ఇలా ఎలా వెళ్ళగలము" అని.
అందుకు బీర్బల్ "లేదులెండి బాద్షా, మా ఇంకొక తల్లి ఉంది. ఆమెను అడగండి ఆమె మీకు సరియైన దారి చూపిస్తుంది" అని చెప్పాడు.
అక్కడ ఎదురుగా గంగానది ప్రవహిస్తోంది....!! బీర్బల్ ఇలా అక్బర్ తో చెప్పడం జరిగింది... "ఇప్పుడు మీరు హర్ హర్ గంగే, జై గంగా మాత" అని నదిలోకి దూకండి అని!
ఆవిధంగా స్నానం చేసి హాయిగా ఫీల్ అవుతు గంగకి నమస్కారం చేసుకున్నాడు అక్బర్.
అప్పుడు బీర్బల్ ..,"మహారాజా, తులసీమాత, గోమాత, గంగామాత జగత్ జగత్ జననీలు, బేధ భావాలు లేకుండా అందరి శుభాన్ని కల్గి మేలు చేస్తుంటారు" అని చెప్పుతూ ఇది నమ్మేవారిని హిందువులు అంటాము.హిందూ అనేది ఒక సభ్యత, సంస్కృతీ విధానమేగాని మతం కాదు, అంతటి గొప్ప జీవన విధానం మాది" అని బుద్ధి చెప్పడం జరిగింది.
. *గో,గంగా, గీత, గాయత్రి లను గౌరవించడం ముఖ్యం, అవి మన సంస్కృతికి మూలస్థంభాలు అని గుర్తించండి*.
Comments
Post a Comment