Telugu story
తెల్లవారింది.నాకు ఐదు గంటలకే మెలకువ వచ్చింది లేచి చేసేది ఏముందని అలాగే పడుకొని ఉన్నాను.మార్నింగ్ వాక్ కి వెళ్ళాలి.కానీ బద్దకంగా అనిపించింది. మావారు బ్యాంక్ మేనేజర్ గా పనిచేసేవారు.ఆయన చనిపోయి రెండేళ్లు అయింది.కొడుకు....కూతురు అమెరికాలో స్థిర పడి పోయారు.నన్నూ అక్కడకు వచ్చేయమంటారు.కానీ నాకే ఇషష్టం లేదు ఆయన పోయాక నాకు ఆసక్తి పోయింది.నిరాశ...నిస్పృహలతో కాలం గడుపుతున్నాను. కాఫీ తాగాలి అనిపించింది.కానీ ఈ మధ్యన చక్కెర వ్యాధి రావడాన డాక్టర్స్ సలహా మేరకు కాఫీ మానేశాను.కాఫీ త్రాగడం ఎప్పటి అలవా టో! చిన్నగా నిట్టూర్చి పైకి లేచాను.బ్రష్ చేసుకొని వాకింగ్ కి బయలు దేరాను.కొంత సేపటికి జాగింగ్ చేస్తూ ఒక యువతి ఎదురు పడింది.వయసు పాతిక ఉంటుంది. అందంగా...ఆరోగ్యంగా...అంతకు మించి చలాకీగా ఉంది. నన్ను చూడగానే "గుడ్ మానింగ్ ఆంటీ!" అని విష్ చేసింది.ఆ అమ్మాయి ఎవరో గుర్తు రాలేదు. ఇంటికి వెళ్ళాక కూడా ఆ అమ్మాయి ని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాను. కానీ గుర్తు రాలేదు.మరుసటి రోజు...