Farmer idea changes his life

 🤔అమ్ముడవని అరటిపళ్లను ఎండబెట్టి..🤔


లాక్ డౌన్ వేళ ఓ రైతుఅద్భుతమే సృష్టించాడు. 


కర్ణాటకలో తాను సాగు చేసిన అరటిపండ్లు అమ్ముడుపోలేదని చెత్తకుప్పలో పారేయకుండా.. వాటిని శ్రద్ధగా ఎండబెట్టాడు. అరటి పండ్లను పోషకాలు నిండిన డ్రైఫ్రూట్​గా మార్చేసి లాభాలు ఆర్జిస్తున్నాడు.


డ్రైఫ్రూట్స్​ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో వైద్యులు చెబుతూనే ఉంటారు. అయితే ఇన్నాళ్లు... ఎండు ద్రాక్ష.. ఎండిన అప్రికాట్​.. ఎండబెట్టిన_అంజీరా.. కాజూ,బాదం.. ఇలా డ్రైఫ్రూట్స్​లో చాలా రకాలే తిని ఉంటాం. కానీ, ఇప్పుడు మన దేశంలో ఉత్పత్తవుతున్న ఎండు అరటిపండును ఈ జాబితాలోకి చేర్చేశాడు కర్ణాటకకు చెందిన ఓ రైతు.


కష్టం నుంచి ఆలోచన!


బళ్లారి, కంపిలి తాలూకా, రామసాగర గ్రామానికి చెందిన K.గంగాధర్​ ఓ_సాధారణ_రైతు. లాక్​డౌన్ వేళ సుగంధి రకం అరటిని సాగు చేశాడు గంగాధర్​. కానీ, కరోనా కారణంగా మార్కెట్​ పడిపోయి గిట్టుబాటు ధర రాలేదు. దీంతో పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరైందని బాధపడ్డాడు​.


కానీ, మనిషి తలచుకుంటే ఎంతటి విపత్తులోనైనా ఓ మార్గాన్ని వెతకొచ్చని గుర్తించాడు. వెంటనే, అరటిపళ్లు పాడవ్వకుండా వాటిని ఏం చేయొచ్చని ఆలోచించాడు.

విదేశాల్లో ఎండు అరటిపండ్లకున్న డిమాండ్​ గురించి తెలుసుకున్నాడు గంగాధర్. 


భారత్​లో తనలాంటి రైతులను సంప్రదించాడు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో.. నెల రోజులకు పైగా అరటి పండ్లను ఎండబెట్టి ఓ డబ్బాలో ప్యాక్​ చేసి జిల్లాలోని హోల్​సేస్​, రిటైల్​ దుకాణాలకు విక్రయించి లాభాలు పొందుతున్నాడు.

ఎండబెట్టిన అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని.. 


ఈ డ్రైఫ్రూట్​ను తింటే ఆరోగ్యానికెన్నో లాభాలున్నాయని రాయ్​చూర్​ వ్యవసాయ వర్సిటీ ధ్రువీకరించింది. దీంతో ప్రభుత్వం సహకరిస్తే... ఈ డ్రై_బనానా ఉత్పత్తిని మరింత 

వృద్ధి చేస్తానంటున్నాడు గంగాధర్​.


ఇంత మంచి ఐడియా Support చేయడం వలన మన రైతుకి ఉపయోగం ఉండొచ్చు

Comments

Popular posts from this blog

Lyrics in Telugu naa cheli rojave song, na cheli rojave song lyrics in Telugu

Telugu story