Telugu story

 సర్జరీ కోసం ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే ఒక డాక్టర్ గారు హడావుడిగా హాస్పిటల్ కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు.


తిన్నగా సర్జరీ బ్లాక్ లోకి వెళ్ళాడు. అక్కడ ఒక అబ్బాయి తండ్రి, గోడకు ఆనుకుని డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు.


డాక్టరును చూసిన వెంటనే కోపంగా "ఇంత ఆలస్యమయింది ఎందుకు?. నా కొడుకు ఇక్కడ ప్రాణం పోయే స్తితిలో ఉన్నాడని మీకు కొంచెం కూడా బాధ్యత లేదా?"


డాక్టర్ చిరునవ్వుతో " సారీ! నేను హాస్పిటల్లో లేను. బయట ఉన్నాను. ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే.. సాధ్యమయినంత త్వరగానే వచ్చాను.


మీరు స్తిమిత పడి శాంతించండి నేను సర్జరీకి వెళతా"...


తండ్రి ఇంకా కోపంతో "శాంత పడాలా? నీ కొడుక్కే ఇలా జరిగి ఉంటే.. నువ్వు శాంతంగా ఉండగలవా?"


డాక్టర్ మొఖంపై చిరునవ్వు చెరగకుండా "మన పవిత్ర వేద గ్రంధాలలో ఉన్నది ఒకటి చెప్పనా.. 'మనం మట్టి నుండే వచ్చాం. మట్టిలోకే వెళ్ళిపోతాం.


అదంతా ఆ భగవంతుని మాయాలీలలు. డాక్టర్స్ ఎవరూ ఎవరి జీవిత కాలాన్ని పొడిగించలేరు. మీరు వెళ్లి మీ కొడుకు కోసం దేవుణ్ణి ప్రార్ధించండి.


నేను చెయ్యవలసింది చేయటానికి ప్రయత్నిస్తాను.


తండ్రి కోపంతో రగిలిపోతూ "మనది కానప్పుడు సలహాలు ఇవ్వటం చాలా తేలిక" అంటూ గొణుకుంటున్నాడు.


డాక్టర్ కొన్ని గంటల తరువాత వచ్చి తండ్రితో "భగవంతునికి ధన్యవాదాలు... మీ కొడుకు ఇప్పుడు క్షేమం. మీరు ఇంకా తిట్టాలనుకుంటే ఆ నర్స్ తో చెప్పండి."


అని.. ఆ తండ్రి నుంచి సమాధానం కోసం ఆగకుండా బయటకు గబగబా వెళ్ళిపోయాడు.


తండ్రి నర్సుతో ఈ డాక్టర్ ఎందుకు ఇంత కఠినాత్ముడు. కొన్ని నిముషాలు కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు అంటూ కోపంతో అన్నాడు

నర్స్ కొన్ని నిముషాల తరువాత ... కన్నీళ్ళతో "ఆ డాక్టర్ గారి కొడుకు నిన్ననే ఒక రోడ్ ఆక్సిడెంటులో చనిపోయాడు.


మేము ఆయనకి ఫోన్ చేసినప్పుడు.. స్మశానంలో ఉన్నారు. మధ్యలో వచ్చి మీ కొడుక్కి ట్రీట్మెంట్ చేసి, మిగిలిన దహన సంస్కారాలు పూర్తి చెయ్యటానికి మళ్ళీ స్మశానానికే వెళ్లారు" అని చెప్పింది.


*🌹ఆయనే డాక్టర్ బీ. సీ. రాయ్🙏*

Comments

Popular posts from this blog

Lyrics in Telugu naa cheli rojave song, na cheli rojave song lyrics in Telugu

Telugu story